న్యూఢిల్లీ: ఇటీవల ఐఐటీ పరీక్షకు సిద్ధమయ్యే పేద విద్యార్థుల ప్రిపరేషన్ కోసం ఒక యాప్ ను రూపొందిస్తామని ప్రకటించిన కేంద్ర మానవ వనరుల శాఖమంత్రి స్మృతి ఇరానీ తాజాగా పాఠశాలల్లో డ్రాపవుట్స్ (మధ్యలో బడి మానేయడం) ను తగ్గించేదుకు మరో యాప్ ను ప్రారంభించనున్నారు. పాఠశాలల్లోని విద్యార్థుల వ్యక్తిగత మార్కుల రాకార్డుతో పాటు, వారి డ్రాపవుట్స్ సమాచారాన్ని ఈ సాప్ట్ వేర్లో పొందుపరచనున్నారు. దీనికి ' షాలా అస్మిత' గా నామకరణం చేయనున్నారని , ఈ విద్యా సంవత్సరం జూన్ మధ్యలో దీనిని ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు.
విద్యార్థుల ఆధార్ నంబర్ ను ఈ యాప్ లో అనుసంధానిస్తారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాల సాయంను తీసుకోనున్నారు. స్థానిక అధికారులు డాటాను ఎప్పటికప్పుడు దీనిని పర్యవేక్షిస్తారు. ఈ యాప్ తో విద్యార్థుల సమాచారం పూర్తిగా అందుబాటు లోకి రానుంది. మధ్యాహ్న భోజన పథకంలో పారదర్శకతకు కూడా ఈ యాప్ ను ఉపయోగించనున్నారు.