ప్యారిస్: కర్ణాటక డ్యామ్‌ల నుంచి ఉప నీటిని విడుదల చేయడంతో హోగ్నెకల్‌కు 71 ఘనపుటడుగుల నీరు చేరుతోంది. మేట్టూరు నీటి మట్టం వంద అడుగులకు చేరుకుంది. కర్ణాటక రాష్ట్రంలో కావేరి నీటి ప్రవాహ ప్రాంతాల్లో, కర్ణాటక - కేరళ సరిహద్దు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ ఉన్న కపిని, కృష్ణరాజసాగర్, హేమావతి, హోరంగి వంటి డ్యామ్‌లు ఇదివరకే నిండిపోయాయి. భద్రత నిమిత్తం డ్యామ్‌లకు వస్తున్న ఉపరి నీటిని కావేరిలోకి విడుదల చేశారు.
కపిని డ్యామ్ నుంచి సెకనుకు 30 వేల ఘనపుటడుగులు, కృష్ణరాయసాగర్‌కు చెందిన ఇతర డ్యామ్‌ల నుంచి 50 వేల ఘనపుటడుగుల నీళ్లు విడుదల చేస్తున్నారు. మెట్టుమెట్టుగా నీటి రాక పెరిగి శనివారం ఉదయం 9 గంటలకు 71 వేల ఘనపుటడుగులకు చేరింది. మెయిన్ జలపాతం, సినీఫాల్స్, ఐవర్‌పాణి వంటి ప్రాంతాల్లో ఉధృతంగా నీళ్లు దుముకుతున్నాయి. వరదనీటి కారణంగా డెల్టా ప్రాంతాల వాసులకు హెచ్చరికలు జారీ చేశారు. వరదలతో కావేరీ తీరంలోను, జలపాతాల వద్ద స్నానాలకు విధించిన నిషేధం 25వ తేదీ వరకు పొడిగించారు.
హోగ్నెకల్‌కు భారీగా వదర నీరు
Published Fri, Aug 8 2014 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM
Advertisement