దివ్యాంగురాలితో ‘పెళ్లి’.. ఆపై అత్యాచారం | Hyderabad Man Molested Maharashtra Disabled Woman | Sakshi
Sakshi News home page

దివ్యాంగురాలితో ‘పెళ్లి’.. ఆపై అత్యాచారం

Published Tue, Dec 24 2019 3:05 AM | Last Updated on Tue, Dec 24 2019 3:05 AM

Hyderabad Man Molested Maharashtra Disabled Woman - Sakshi

పాల్ఘర్‌: దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో హైదరాబాద్‌కు చెందిన 37 ఏళ్ల వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాకు చెందిన ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెను వివాహం చేసుకున్న ఆ ప్రబుద్ధుడు ఆపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. టీచర్‌ అయిన మహమ్మద్‌ అన్వర్‌ మొయినుద్దీన్, వసాయి కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమెతో స్నేహం పెంచుకున్నాడు. గత మే నెలలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ‘అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు. తదుపరి ఆమెతో బంధాన్ని కొనసాగించ డానికి నిరాకరించడంతో ఆమె అతనిపై ఫిర్యాదు చేసింది’ అని పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement