న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన ఆరాధ్య నేత అని డెన్మార్క్ ప్రధాని ఆండర్స్ రాస్ముసెన్ వ్యాఖ్యానించారు. భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు ‘రైజినా డైలాగ్’లో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ కూడా పాల్గొన్న ఆ కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం ఇస్తూ.. ప్రపంచవ్యాప్తంగా నియంత పాలకులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య దేశాలు ఒక అంతర్జాతీయ కూటమి కట్టాలని రాస్ముసెన్ కోరారు. ఆ కూటమిలో భారత్ కీలకపాత్ర పోషించాలన్నారు.
‘ఈ కూటమిలో భారత్ పాత్ర కీలకం. ప్రధాని మోదీకి నేను అభిమానిని’ అని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాల కీలక నేతలు పాల్గొంటున్న ఈ సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఇరాన్– అమెరికాల మధ్య ఉద్రిక్తత, అఫ్గానిస్తాన్‌లో శాంతి, వాతావరణ మార్పు.. తదితర ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ సదస్సులో చర్చిస్తారు. కార్యక్రమంలో న్యూజీలాండ్ పీఎం హెలెన్ క్లార్క్, అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయి, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్, స్వీడన్ మాజీ పీఎం కార్ల్ బ్లిడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment