సాక్షి, ముంబై : ‘నేను కూడా ఒకప్పుడు లైంగిక వేధింపులకు గురైనవ్యక్తినే.. నేనేంటి భారతదేశంలో ప్రతి మహిళ ఏదో ఒక సంమయంలో లైంగిక వేధింపులకు గురై ఉంటుంద’ని బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ పేర్కొన్నారు. అహ్మదాబాద్ ఐఐఎం విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పూనమ్ మహాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్న మహిళలు.. మరింత ధైర్యంగా, ధృఢంగా మారాలని చెప్పారు.
‘నేను కాలేజ్‌కి వెళ్లే రోజుల్లో వెర్సో నుంచి వర్లీ వరకూ లోకల్ ట్రైన్‌లో వెళ్లేదాన్ని.. అప్పట్లో నా చుట్టు ఉన్నవ్యక్తులు.. నన్ను అసభ్యకరంగా చూసేవారు. కొన్ని సందర్భాల్లో స్పృశించే ప్రయత్నాలు చేశారు. నేనేంటి ప్రపంచంలోని ప్రతి మహిళకు ఇటువంటి అనుభవాలు ఉంటాయ’ని ఆమె అన్నారు.
నేనూ లైంగిక వేధింపులకు గురయ్యాను
Published Mon, Oct 2 2017 10:33 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM
Advertisement
Advertisement