ఎప్పటికైనా వాళ్లిద్దర్ని కలుపుతాను: లాలూ
పాట్నా: భారతీయ జనతా పార్టీకి చెక్ పెట్టేందుకు సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మయావతిల మధ్య మైత్రిని కుదిర్చేందుకు ప్రయత్నిస్తానని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బీజేపీ కమండల రాజకీయాలకు ధీటుగా మండల రాజకీయాలను తెరపైకి తెస్తామన్నారు.
మత శక్తులను అడ్డుకునేందకు కులాలన్నింటిని ఏకం చేస్తామని ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. ములాయం, మాయవతిలు కలుస్తారనే ఆశాభావాన్ని లాలూ వ్యక్తం చేశారు. ఒకటి రెండు రోజుల్లో ఆశించే పనికాదు. కొంత సమయం తీసుకుంటాను.
ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ ఓడించేందుకు చేతులు కలుపుతామనే విశ్వాసం తనకుందని లాలూ అన్నారు. గత లోకసభ ఎన్నికల్లో 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ లో బీజేపీ 71 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.