ఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయపు పన్ను శాఖ ఓ మొబైల్ యాప్ను సిద్ధం చేస్తోంది. శనివారం ఢిల్లీలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్లో పన్ను చెల్లింపుదారుల సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్( సీబీడీటీ) చైర్ పర్సన్ అనితా కపూర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇటీవలి కాలంలో ఆన్లైన్ పన్నుల చెల్లింపు విధానం ఎక్కువగా వాడుకలో ఉంటున్నది. ఈ సరళికి అనుకూలంగా మొబైల్ యాప్ను ప్రవేశపెట్టబోతున్నట్లు ఆమె తెలిపారు. అయితే యాప్ ద్వారా చెల్లింపులు చేపట్టడంలో ఎదురయ్యే భద్రతా పరమైన అంశాలకు సంబంధించిన అడ్డంకులను తొలగించడానికి కృషి జరుగుతున్నట్లు తెలిపిన ఆమె త్వరలోనే యాప్ను పన్నుచెల్లింపుదారులకు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.