
న్యూఢిల్లీ: భారతదేశం తీవ్రమైన ఆకలి సమస్యతో బాధపడుతోంది. తాజాగా విడుదల చేసిన ప్రపంచ ఆకలి సూచీలో 119 దేశాల జాబితాలో భారత్ 100వ స్థానంలో ఉంది. ఉత్తర కొరియా, బంగ్లాదేశ్, ఇరాక్ కన్నా వెనుక స్థానంలో ఉండగా, పాకిస్తాన్ కన్నా కొంచెం మెరుగైన ర్యాంకు సాధించింది. భారత్‌లో ఆకలికి ముఖ్యమైన కారణం పిల్లల్లో అధిక శాతం పౌష్టికాహార లోపమని, దీన్ని తగ్గించాలంటే సమాజం నిబద్ధతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆహార విధాన పరిశోధన సంస్థ (ఐఎఫ్‌పీఆర్‌ఐ) తన నివేదికలో పేర్కొంది.
గతేడాది భారత్ 97వ స్థానంలో ఉంది. తన పొరుగు దేశాల కన్నా భారత్ తక్కువ స్థానంలో ఉందని ఐఎఫ్‌పీఆర్‌ఐ వ్యాఖ్యానించింది. చైనా (29), నేపాల్ (72), మయన్మార్ (77), శ్రీలంక (84), బంగ్లాదేశ్ (88)తో మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. పాక్(106), అఫ్గానిస్తాన్ 107వ ర్యాంకులతో భారత్ కన్నా వెనుక ఉన్నాయి. ఉత్తర కొరియా 93, ఇరాక్ 78వ స్థానంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment