పణజీ: గోవా సమీపలోని సముద్రంలో భారత్, ఫ్రాన్స్‌లు నౌకా విన్యాసాలను శుక్రవారం ప్రారంభించాయి. ఫ్రాన్స్‌కు చెందిన విమాన వాహక నౌక చార్లెస్ డీ గాల్లె కేంద్రంగా ఈ విన్యాసాలు సాగుతున్నాయి. చైనాను హెచ్చరించేలా ఈ విన్యాసాలు ఉన్నాయని భావిస్తుండగా, అలాంటిదేమీ లేదని ఫ్రాన్స్ కొట్టిపారేసింది. దక్షిణ చైనా సముద్రంలోని ఇతర దేశాల భాగాలను తమవిగా చైనా చెప్పుకోవడం ఉద్రిక్తతలకు దారితీయడం తెలిసిందే. ఫ్రెంచ్ ఫ్లీట్‌కు సారథ్యం వహిస్తున్న రియర్ అడ్మిరల్ ఒలివియర్ లెబాస్ మాట్లాడుతూ ‘అంతర్జాతీయ వాణిజ్యం పరంగా వ్యూహాత్మకమైన ఈ ప్రాంతంలో మేం మరింత స్థిరత్వం తీసుకురాగలమని అనుకుంటున్నాం’ అని చెప్పారు. ఈ విన్యాసాల్లో ఇరు దేశాల నుంచి యుద్ధ నౌకలు, జలాంతర్గాములు కలిపి 12 (ఒక్కో దేశం నుంచి ఆరు) పాల్గొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment