న్యూఢిల్లీ/శ్రీనగర్/మాలె: ఈ నెల 15వ తేదీ నుంచి వందే భారత్ మిషన్‌ను రెండో విడత చేపట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. రెండో విడతలో కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, రష్యా, జర్మనీ, స్పెయి¯Œ దేశాల్లో ఉన్న భారతీయులను తీసుకురానున్నారు. లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు రెండో రోజు కొనసాగింది. శుక్రవారం సింగపూర్ నుంచి 234 మంది, బంగ్లాదేశ్ నుంచి 168 మంది స్వదేశానికి చేరుకున్నారు.
మొదటి రోజైన గురువారం రాత్రి యూఏఈ నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో 363 మంది భారతీయులు కేరళకు చేరుకున్న విషయం తెలిసిందే. వందే భారత్ మిషన్‌లో భాగంగా సింగపూర్ నుంచి 234 మంది భారతీయ ప్రయాణికులతో కూడిన ప్రత్యేక బోయింగ్ విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. అందులోని వారందరికీ స్క్రీనింగ్ చేపట్టి, క్వారంటైన్‌కు తరలించారు. వీరితోపాటు, బంగ్లాదేశ్‌లో వైద్య విద్యనభ్యసిస్తున్న 168 మంది కశ్మీర్ విద్యార్థులతో కూడిన మొదటి విమానం నేరుగా శ్రీనగర్‌కు చేరుకుంది. కాగా, మాల్దీవుల్లో ఉన్న భారతీయుల కోసం పంపిన నేవీకి చెందిన ఐఎన్‌ఎస్ యుద్ధనౌక ‘జలాశ్వ’ 700 మందితో గురువారం తిరుగు పయనమయింది. 10వ తేదీ నాటికి కోచికి చేరుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment