Indians move
-
15 నుంచి ‘వందే భారత్’ రెండో విడత
న్యూఢిల్లీ/శ్రీనగర్/మాలె: ఈ నెల 15వ తేదీ నుంచి వందే భారత్ మిషన్‌ను రెండో విడత చేపట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. రెండో విడతలో కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, రష్యా, జర్మనీ, స్పెయి¯Œ దేశాల్లో ఉన్న భారతీయులను తీసుకురానున్నారు. లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు రెండో రోజు కొనసాగింది. శుక్రవారం సింగపూర్ నుంచి 234 మంది, బంగ్లాదేశ్ నుంచి 168 మంది స్వదేశానికి చేరుకున్నారు. మొదటి రోజైన గురువారం రాత్రి యూఏఈ నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో 363 మంది భారతీయులు కేరళకు చేరుకున్న విషయం తెలిసిందే. వందే భారత్ మిషన్‌లో భాగంగా సింగపూర్ నుంచి 234 మంది భారతీయ ప్రయాణికులతో కూడిన ప్రత్యేక బోయింగ్ విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. అందులోని వారందరికీ స్క్రీనింగ్ చేపట్టి, క్వారంటైన్‌కు తరలించారు. వీరితోపాటు, బంగ్లాదేశ్‌లో వైద్య విద్యనభ్యసిస్తున్న 168 మంది కశ్మీర్ విద్యార్థులతో కూడిన మొదటి విమానం నేరుగా శ్రీనగర్‌కు చేరుకుంది. కాగా, మాల్దీవుల్లో ఉన్న భారతీయుల కోసం పంపిన నేవీకి చెందిన ఐఎన్ఎస్ యుద్ధనౌక ‘జలాశ్వ’ 700 మందితో గురువారం తిరుగు పయనమయింది. 10వ తేదీ నాటికి కోచికి చేరుకోనుంది. -
భారతీయుల తరలింపునకు యుద్ధనౌక
న్యూఢిల్లీ: అంతర్యుద్ధంతో నెత్తురోడుతున్న ఇరాక్ నుంచి తమ పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. శనివారం గల్ఫ్ సింధుశాఖలో ఐఎన్ఎస్ మైసూర్ యుద్ధనౌకను మోహరించింది. ఆడెన్ సింధుశాఖలో మరో యుద్ధనౌక ఐఎన్ఎస్ తార్కాస్ ఉందని, అవసరమైతే భారతీయుల తరలింపు కోసం ఈ నౌకలను రంగంలోకి దించుతామని నౌకాదళ వర్గాలు చెప్పాయి. రెండు యుద్ధవిమానాలను రంగంలోకి దించేందుకు వాయుసేన సిద్ధంగా ఉందన్నాయి. ఇరాక్‌లో ఘర్షణలు లేని ప్రాంతాల్లో ఉన్న భారతీయులకు స్వదేశానికి వచ్చేందుకు సాయం చేయడానికి భారత్ నజాఫ్, కర్బాలా, బస్రాల్లో క్యాంపు ఆఫీసులను ఏర్పాటు చేసింది. నజాఫ్ క్యాంపు అధికారులను 964771 6511190, 9647716511181, 9647716511179 ఫోన్ నంబర్లు @gmai.com లో, కర్బాలా అధికారులను 9647716511180, 9647716511176 ఫోన్ నంబర్లు, @gmai.comలో, బస్రా అధికారులను 9647716511182,9647716511178, @gmai.comలో సంప్రదించాలని సూచించింది. ప్రయాణ పత్రాలతోపాటు, ప్రయాణాలకు డబ్బులేని వారికి ఉచిత విమాన టికెట్లు ఇస్తామని విదేశాంగ శాఖ తెలిపింది.