భారతీయుల తరలింపునకు యుద్ధనౌక | battleship is move to tndia | Sakshi
Sakshi News home page

భారతీయుల తరలింపునకు యుద్ధనౌక

Published Sun, Jun 29 2014 2:43 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

భారతీయుల తరలింపునకు యుద్ధనౌక - Sakshi

భారతీయుల తరలింపునకు యుద్ధనౌక

న్యూఢిల్లీ: అంతర్యుద్ధంతో నెత్తురోడుతున్న ఇరాక్ నుంచి తమ పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. శనివారం గల్ఫ్ సింధుశాఖలో ఐఎన్‌ఎస్ మైసూర్ యుద్ధనౌకను మోహరించింది. ఆడెన్ సింధుశాఖలో మరో యుద్ధనౌక ఐఎన్‌ఎస్ తార్కాస్ ఉందని, అవసరమైతే భారతీయుల తరలింపు కోసం ఈ నౌకలను రంగంలోకి దించుతామని నౌకాదళ వర్గాలు చెప్పాయి. రెండు యుద్ధవిమానాలను రంగంలోకి దించేందుకు వాయుసేన సిద్ధంగా ఉందన్నాయి.

ఇరాక్‌లో ఘర్షణలు లేని ప్రాంతాల్లో ఉన్న భారతీయులకు స్వదేశానికి వచ్చేందుకు సాయం చేయడానికి భారత్ నజాఫ్, కర్బాలా, బస్రాల్లో క్యాంపు ఆఫీసులను ఏర్పాటు చేసింది. నజాఫ్ క్యాంపు అధికారులను 964771 6511190, 9647716511181, 9647716511179 ఫోన్ నంబర్లు @gmai.com  లో, కర్బాలా  అధికారులను 9647716511180, 9647716511176 ఫోన్ నంబర్లు,  @gmai.comలో, బస్రా అధికారులను 9647716511182,9647716511178, @gmai.comలో సంప్రదించాలని సూచించింది. ప్రయాణ పత్రాలతోపాటు, ప్రయాణాలకు డబ్బులేని వారికి ఉచిత విమాన టికెట్లు ఇస్తామని విదేశాంగ శాఖ తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement