న్యూఢిల్లీ: ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలను అనుసంధానించే హైస్పీడ్ రైలు ప్రాజెక్టును 2022 ఆగస్టుకల్లా పూర్తిచేయాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిష్టాత్మక స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో 160 కి.మీ. వేగంతో మెట్రోల మధ్య రైళ్లు నడిచేలా చర్యలు చేపట్టనున్నారు. ఆ కారిడార్‌లో ప్రస్తుత రైళ్ల సగటు వేగం గంటకు 88–90 కి.మీ. మాత్రమే. అలాగే మెట్రో నగరాల మధ్య 10 వేల కి.మీ. నెట్‌వర్క్‌తో సెమీ హైస్పీడ్ రూట్లను 2022 (ఆగస్టు 15) 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రారంభించాలని యోచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment