
ఐజీపై అత్యాచారం కేసు
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐజీ అమితాబ్ థాకూర్పై అత్యాచారం కేసు నమోదైంది. శనివారం రాత్రి ఉత్తరప్రదేశ్ పోలీసులు థాకూర్తో పాటు ఆయన భార్య నూతన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఘజియాబాద్కు చెందిన ఓ యువతి గతేడాది తనపై థాకూర్ లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. ఇందుకు థాకూర్ భార్య నూతన్ ఆయనకు సహకరించారంటూ ఆరోపించింది. ఇదిలావుండగా, ములాయం తనను ఫోన్లో బెదిరించారంటూ శనివారం థాకూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా థాకూర్ ఆరోపణలను సమాజ్వాదీ పార్టీ ప్రతినిధి సీపీ రాయ్ తోసిపుచ్చారు.