వీడియో దృశ్యం
కేరళలో జరిగిన అమానుష ఘటన యావద్ధేశాన్ని కదిలించింది. మానవత్వం ఉన్న ప్రతీ మనిషి కళ్లు బాధతో చెమ్మగిల్లాయి. గర్భంతో ఉన్న ఏనుగుపై ఘోరానికి పాల్పడిన వారిపై జనం భగ్గుమన్నారు. దాన్నో క్రూరమైన చర్యగా అభివర్ణించటమే కాకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రముఖులు సైతం మూగజీవం కోసం గళమెత్తారు. ఈ నేపథ్యంలో అందరు మనుషులూ ఒకేలా ఉండరని, మానవత్వం, జంతుప్రేమ ఉన్నవారు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారని తెలిపే ఓ పాత వీడియోను ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా గురువారం తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ( 'ఛీ, వినడానికే దరిద్రంగా ఉంది' )
కుక్క కోసం శ్రమిస్తున్న మానవతావాదులు, జంతుప్రేమికులు
‘‘ఆనందంతో మనసు పులకరించే వీడియో.. ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. వీరిని తప్పు బట్టగలమా?’’ అని ఆమె పేర్కొన్నారు. ఓ పెద్ద కాలువలో చిక్కుకు పోయిన కుక్కను కాపాడటానికి కొంతమంది ప్రాణాలకు తెగించి ప్రయత్నాలు చేశారు. మనిషి, మనిషికి తోడు, ఆ మనిషి ఓ మూగజీవానికి తోడు అన్నట్లుగా దాన్ని పైకి చేర్చారు.
ప్రస్తుతం ఈ వీడియో మరోసారి వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ మానవత్వం బ్రతికే ఉంటది.. వీరు మానవత్వపు వీరులు, అందుకే ప్రాణాలకు తెగించి మీర కుక్కను రక్షిస్తున్నారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( కోబ్రాతో ఫైట్: కోతి పోరాటానికి ఫిదా! )
Comments
Please login to add a commentAdd a comment