
జూలైలో ఇరోమ్ షర్మిల ప్రేమ వివాహం!
మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల ఇంగ్లండ్‌కు చెందిన డెస్మాండ్‌ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.
సాక్షి ప్రతినిధి, చెన్నై: మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల ఇంగ్లండ్‌కు చెందిన డెస్మాండ్‌ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. తమిళనాడులోని కొడైకెనాల్‌లో జూలైలో ఆమె పెళ్లి నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మణిపూర్‌లో అమల్లో ఉన్న ప్రత్యేక సాయుధ దళ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో పదహారేళ్లు నిరాహార దీక్ష చేసిన షర్మిల గతేడాది విరమించిన విషయం తెలిసిందే. అనంతరం రాజకీయ పార్టీని స్థాపించి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం ఇబోబి సింగ్‌పై పోటీ చేసి కేవలం 90 ఓట్లు పొంది ఘోర పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో ఆమె పర్యటించి సామాజిక పోరాటాలు కొనసాగిస్తానని ప్రకటించారు.