ఇక మోదీ వద్దకు ఇరోమ్ షర్మిల పయనం | Irom Sharmila Wants to Meet Modi to Take Advice From Him | Sakshi
Sakshi News home page

ఇక మోదీ వద్దకు ఇరోమ్ షర్మిల పయనం

Published Sun, Oct 2 2016 2:56 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

ఇక మోదీ వద్దకు ఇరోమ్ షర్మిల పయనం - Sakshi

ఇక మోదీ వద్దకు ఇరోమ్ షర్మిల పయనం

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసిన తర్వాత మణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిల ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అవ్వాలనుకుంటుంది. ఆయన నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని ఇరోమ్ భావిస్తోంది. ఈసారి జరగబోయే మణిపూర్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆమె మేజర్ పొలిటికల్ పార్టీలను ఎలా ఓడించాలనే అంశంపై కొన్ని సలహాలు తీసుకునేందుకు గత నెల (సెప్టెంబర్ 26)న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను కలిసింది.

'మంచి సలహాలు అనేవి ఎప్పటికీ స్వీకరించాల్సిన అంశాలు. అది స్నేహితుడైనా, శత్రువైనా అతడి వద్ద కొన్ని మంచి ఆలోచనలు ఉండి వాటిని నాతో పంచుకోవాలనుకుంటే తప్పకుండా స్వీకరిస్తాను' అని ఆమె ఓ వార్తా సంస్థతో చెప్పారు. గతంలోనే తాను మోదీని కలుస్తానన్న షర్మిల త్వరలోనే ఆయనను కలవాలని అనుకుంటోంది. గతంలో కూడా మణిపూర్ లో ఉన్న ప్రత్యేక ఆయుధాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)ను తీసేయాలని తాను ప్రధాని విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement