తమిళనాడులో ఐటీ ముమ్మర దాడులు | IT raids at Panneerselvam And Sasikala relative homes | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఐటీ ముమ్మర దాడులు

Published Sun, Dec 11 2016 10:10 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

తమిళనాడులో ఐటీ ముమ్మర దాడులు - Sakshi

తమిళనాడులో ఐటీ ముమ్మర దాడులు

చెన్నై: తమిళనాడులో పలు ప్రాంతాల్లో ఆదాయపన్నుశాఖ (ఐటీ), ఈడీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం, దివంగత నేత జయలలిత నెచ్చెలి శశికళ సన్నిహితుల ఇళ్లు, ఆస్తులు లక్ష్యంగా చేసుకుని ఐటీశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

రాజధాని చెన్నై, తిరునల్వేవి, వెల్లూరు, కాట్పాడి సహా 16 ముఖ్య ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ శేఖర్ రెడ్డి, అతని సన్నిహితుల వద్ద నుంచి 154 కేజీల బంగారంతో పాటు రూ.130 కోట్ల కొత్త కరెన్సీని, రూ. 1200 కోట్ల విలువైన దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement