కటకటాల వెనక్కి జైలు అధికారి | Jail official jailed for abusing minor | Sakshi
Sakshi News home page

కటకటాల వెనక్కి జైలు అధికారి

Published Thu, Mar 17 2016 4:36 PM | Last Updated on Tue, Oct 2 2018 6:54 PM

Jail official jailed for abusing minor

పాట్నా: బిహార్ జైలు అధికారి ప్రవర్తనా తీరు... కంచె చేను మేసిన చందంగా తయారైంది. ప్రజలను రక్షించాల్సిన పోలీసు అధికారే కీచకుడుగా మారిన ఘటన వెలుగు చూసింది. సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఓ వీడియో సదరు అధికారిని కటకటాల వెనక్కు పంపింది.

బిహార్ జైలు సూపరింటిండెంట్ కృపా శంకర్ పాండే మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు అధికారులు వెల్లడించారు. కిషన్ గంజ్ ఐజీ ఆనంద్ కిషోర్ ఉత్తర్వుల  మేరకు బిహార్ కిషన్ గంజ్ జైల్ సూరరింటిండెంట్ కృపా శంకర్ పాండేను పోలీసులు అరెస్టు చేసి  జైలుకు తరలించారు.

కాగా విధుల్లో ఉన్న సమయంలో జైలు ప్రాంగణంలోనే ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దృష్టికి వెళ్లడంతో... పాండేను విధులనుంచి సస్సెండ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం  సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఓ వీడియో ఆధారంగా జైల్ సూపరింటిండెంట్ పాండే.. బాలికను లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లుగా నిర్థారణ అయింది.

కాగా గతంలో కూడా పాండేపై అనేక అభియోగాలు ఉన్నాయి. జైల్లో ఉన్న మహిళలు తనతో సెక్స్ కు సహకరించాలని బలవంతం చేసినట్లుగా గతేడాది అతడు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. మహిళలపట్ల పాండే అసభ్యంగా ప్రవర్తిస్తాడని, కించపరిచేలా వ్యవహరిస్తాడని, అతడ్ని నిరాకరిస్తే వారిని కొట్టేందుకు కూడా వెనుకాడడని పలువురు  ఖైదీలు సైతం ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement