క్లాస్‌మెట్సే అత్యాచారం చేశారు.. | Jalandhar cops arrest college student who got girlfriend raped to avoid marriage | Sakshi
Sakshi News home page

క్లాస్‌మెట్సే అత్యాచారం చేశారు..

Published Tue, Jul 25 2017 11:11 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

క్లాస్‌మెట్సే అత్యాచారం చేశారు.. - Sakshi

క్లాస్‌మెట్సే అత్యాచారం చేశారు..

జలంధర్‌: పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి(19)పై ఆమె స్నేహితులే అత్యాచారం జరిపారు.  పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేని ఆమె ప్రియుడు తన ఇద్దరి స్నేహితులతో సాముహిక అత్యాచారానికి కుట్రపన్నాడు. ఈ ఘటన జలంధర్‌లోని తల్వాణ్‌ గ్రామంలో చోటుచేసుకుంది.

అదే గ్రామానికి చెందిన  బాథితురాలు(19), నిందితుడు హర్ప్రీత్‌ సింగ్‌ హ్యాపీ(19)  గత కొద్దీరోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే సుదీర్ఘకాలం తర్వాత పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. జులై 20 న బాధితురాలని తల్లితండ్రులకు పరిచయం చేస్తానని తెలిపిన నిందితుడు. అదే రాత్రి 10.30 గంటలకు ఆమె ఇంటి నుంచి బైక్‌పై ఎక్కించుకొని  దారి మధ్యలో అతని మిత్రులు బిందు, రవిల బైక్‌ ఎక్కించాడు. తన తల్లి తండ్రులను తీసుకొస్తానని ఆమెకు మాయ మాలలు చెప్పి వెళ్లిపోయాడు. వారిద్దరూ బాధితురాలని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తనపై  అత్యాచారం జరిపారని అనంతరం ఓ గదికి తీసుకొచ్చి మళ్లీ అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.

కుట్రదారుడు హర్ప్రీత్‌ సింగ్‌ను జలంధర్‌ పోలీసలు అదుపులోకి తీసుకొన్నారు. అతనితో పాటు స్నేహితులపై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులు ముగ్గురు ఒకే గ్రామానికి చెందిన వారని,  బాధితురాలి క్లాస్‌మెట్స్‌ అని పోలీసులు తెలిపారు.  బాధితురాలని మెడికల్‌ టెస్టులకు పంపిచామని నిందుతిడు హ్యాపీని కోర్టులో హాజపరుచామని త్వరలోనే అతని స్నేహితులను అదుపులోకి తీసుకంటామని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement