
నోట్ల రద్దు అనంతరం పెరిగిన ఉగ్ర చేరికలు
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నోట్ల రద్దు సంచలనం సృష్టిచింది. అవినీతి, నల్లధనంపై చేపట్టిన యుద్ధమని ప్రధాని ప్రకటించారు. కానీ నోట్ల రద్దు భారత్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. కాశ్మీర్‌లోని యువతను ఉగ్రమార్గంవైపు మళ్లిస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లోని యువత నగదు, ఆయుధాలకోసం మిలిటెంట్లు గా మారుతున్నారు. బ్యాంకు దొంగతనాలకు పాల్పడుతన్నారు. ఇటీవలి జరిగిన దోపిడిల్లో పాల్గొంది సుమారు 80శాతం మంది స్థానిక మిలిటెంట్లే.
ఇటీవలి ఒక సర్వే ప్రకారం నోట్ల రద్దు అనంతరం 13బ్యాంకు దొంగతనాలు, మరో తొమ్మిది ప్రయత్నాలు జరిగాయి.ఇందులో ఎక్కువగా జమ్మూ కాశ్మీర్‌కు సంబంధిన బ్యాంకులు. 2016 నవంబర్ ఎనిమిది నుంచి 2017 మే 3వరకూ సుమారు 91లక్షల డబ్బును పలు బ్యాంకలనుంచి దోచుకెళ్లారు. ఇందులో ఏడు సార్లు జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ శాఖల్లో దోచకెళ్లారు. అలాగే పుల్వామా లోని ఇలాఖి దెహాత్ బ్యాంకు నుంచి ఒకసారి, ఎస్‌బీఐ నుంచి మరోసారి దోచుకుపోయారు.
డబ్బు ఎలా వస్తుంది?
ఇంటలిజెన్స్ సమాచారం ప్రకారం నగదు దోపిడి, ఆయుధాల చోరీలు ఇటీవల చాలా పెరిగాయని సమాచారం. సుమారు 200మంది ఇలాంటి దొంగతనాల గ్రూపుల్లో చేరారు. నవంబర్ ఎనిమిదికి ముందు ఇలాంటి ఘటనలు చాలా తక్కువ అని, వీరిని పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందని ఓ అధికారి తెలిపారు. పాకిస్తాన్ సైబర్ నేరస్తులు 'మాల్ ఈ ఘనిమత్' పేరుతో నిధులు సేకరించుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ చర్యల్లో స్థానికులను చేర్చుకొని శిక్షణ ఇవ్వడం పాకిస్తాన్, దాని ఉగ్రవాద సంస్థల పని. ఉగ్రవాదలకు వచ్చే నిధుల్లో ఎక్కువ భాగం స్థానికులు చందాల రూపంలో, మనీ లాండరింగ్ రూపంలో, ఏర్పాటు వాదులనుంచి వస్తున్నవే. ఇందులో ఎక్కువ భాగం ఆయుధాల కొనుగోలు, ఉగ్రవాద శిక్షణకు, సైబర్ నేరాలకు ఉపయోగిస్తున్నారు.
అడ్డుకున్న భారత బలగాలు
ఇటీవల జమ్మూ కాశ్మీర్ నుంచి ఉగ్రవాదులకు ఆయుధాలు, డబ్బు సరఫరాను భారత బలగాలు భారీ మెత్తంలో అడ్డుకున్నాయి. దీంతో స్థానిక మిలిటెంట్లకు నగదు కొరత ఏర్పడింది. అంతేకాకుండా ఉగ్రవాదులకు నిధులు సాయం చేస్తున్న నాసిర్ షఫి బ్యాంకు అకౌంట్లను స్తంభింపచేశారు. వీటన్నింటి అరికట్టడానికి ప్రస్తుతం బ్యాంకులు అనవసరంగా జరిగే నగదు లావదేవీలపై పరిమితి విధించాయి., జమ్మూ కాశ్మీర్‌పోలీసులు బ్యాంకు దోపిడీ దారులను గుర్తించే పనిలో ఉన్నారు.