గౌరవ ప్రొఫెసర్ పదవికి గంగూలీ రాజీనామా | justice Ganguly quits NUJS faculty, but denies allegations | Sakshi
Sakshi News home page

గౌరవ ప్రొఫెసర్ పదవికి గంగూలీ రాజీనామా

Published Sat, Jan 4 2014 1:09 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

గౌరవ ప్రొఫెసర్ పదవికి గంగూలీ రాజీనామా - Sakshi

గౌరవ ప్రొఫెసర్ పదవికి గంగూలీ రాజీనామా

కోల్‌కతా/న్యూఢిల్లీ: న్యాయ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటు న్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్‌కుమార్ గంగూలీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యురిడికల్ సెన్సైస్ (ఎన్‌యూజేఎస్)లో గౌరవ ప్రొఫెసర్ పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఆయనపై ఆరోపణలు చేసిన న్యాయ విద్యార్థిని(ఇంటర్న్) ఎన్‌యూజేఎస్ విద్యార్థి కావడం గమనార్హం. ఆరోపణల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవి నుంచి ఆయన్ను తొలగించేందుకు, తదుపరి ఆయనపై విచారణ చేపట్టేందుకు వీలుగా రాష్ర్టపతి నివేదన కోరాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపిన నేపథ్యంలో గౌరవ ప్రొఫెసర్ పదవికి గంగూలీ రాజీ నామా చేయడం గమనార్హం.

 

తనను కొనసాగించడంపై ఫ్యాకల్టీకి చెందిన కొందరు సభ్యులు అభ్యం తరం వ్యక్తం చేసినందున.. రాజీనామాను పంపినట్టు గంగూలీ ఓ వార్తాసంస్థతో చెప్పారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement