కొత్త సీజేఐగా జస్టిస్ లోధా
న్యూఢిల్లీ: భారత త దుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ రాజేంద్ర మల్ లోధా నియమితులయ్యూరు. సుప్రీంకోర్టు ప్రస్తుత చీఫ్ జస్టిస్ పి.సదాశివం స్థానంలో ఈ నెల 27న ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. జస్టిస్ సదాశివం ఈ నెలలో పదవీ విరమణ చేయనున్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్.ఎం.లోధాను భారత ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమించినట్టు న్యాయ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 27 నుంచి ఈ నియూమకం అమల్లోకి వస్తుందని పేర్కొంది. చీఫ్ జస్టిస్ సదాశివం తర్వాత అరవై నాలుగేళ్ల జస్టిస్ లోధాయే సుప్రీం కోర్టులో అందరికన్నా సీనియర్. జస్టిస్ లోధా ఈ ఏడాది సెప్టెంబర్ 27న పదవీ విరమణ చేయూల్సి ఉంది.
దీంతో కేవలం ఐదు నెలల స్వల్పకాలం మాత్రమే ఆయన సీజేఐగా కొనసాగనున్నారు. తదుపరి చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ లోధా పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సదాశివం సిఫారసు చేశారు. ఉన్నత న్యాయవ్యవస్థలో సభ్యుల నియూమకాలకు సంబంధించిన నిబంధనల ప్రకారం.. భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యేవారు సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులందరికన్నా సీనియర్ అరుు ఉండాలి.
జోధ్‌పూర్‌లో జననం
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జన్మించిన లోధా 1973 ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. అక్కడి హైకోర్టులో ప్రాక్టీస్ కొనసాగించి.. రాజ్యాంగం, సివిల్, కంపెనీ, క్రిమినల్, పన్నుల విధానం, కార్మిక తదితర అన్ని కేసులనూ వాదించారు.
1994 జనవరిలో రాజస్థాన్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అదే ఏడాది ఫిబ్రవరిలో బదిలీపై బాంబే హైకోర్టుకు వెళ్లారు. 2007 ఫిబ్రవరిలో రాజస్థాన్ హైకోర్టుకు తిరిగివచ్చిన జస్టిస్ లోధా అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా, ఆ రాష్ట్ర న్యాయ అకాడెమీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
2008 మే 13న పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అదే ఏడాది డిసెంబర్ 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
పలు కీలక తీర్పులు వెలువరించిన జస్టిస్ లోధా
బొగ్గు గనుల స్కాంపై జరుగుతున్న సీబీఐ దర్యాప్తును లోధా నేతృత్వంలోని బెంచ్ పర్యవేక్షిస్తోంది.
కోల్‌గేట్ విచారణకు సంబంధించిన సమాచారాన్ని సీబీఐ రాజకీయ ప్రతినిధితో పంచుకోదంటూ జస్టిస్ లోధా నేతృత్వంలోని ధర్మాసనమే ఉత్తర్వులిచ్చింది. ఈ తీర్పు గత ఏడాది అప్పటి న్యాయశాఖ మంత్రి అశ్వనికుమార్ రాజీనామాకు కారణమైంది.
రాజకీయ కబంధ హస్తాల నుంచి సీబీఐని విముక్తం చేస్తూ తీర్పు వెలువడటంలో ఈయన కీలకపాత్ర పోషించారు.
జస్టిస్ లోధా నేతృత్వంలోని మరో బెంచ్ దేశంలో క్లినికల్ ట్రయల్స్‌ను (మనుషులపై ప్రయోగాలు) నిలుపుదల వేస్తూ తీర్పు చెప్పింది. ఔషధ కంపెనీల కంటే ప్రజా ప్రయోజనాలు అత్యంత ముఖ్యమని పేర్కొంది.