నడిరోడ్డుపై కబడ్డీ ప్లేయర్ను కాల్చిచంపారు
రోహ్తక్: పట్టపగలు హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రోహ్తక్ లో దారుణంగా చంపేశారు. స్కూటర్ పై వచ్చి వరుస కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. సుఖ్విందర్ నర్వాల్ అనే కబడ్డీ క్రీడాకారుడు ప్రాక్టీస్కు వెళ్లి తిరిగొస్తున్నాడు.
ఆ సమయంలో అతడు రోడ్డు వెంట నడుస్తూ మొబైల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ వెళుతున్నాడు. అప్పుడే స్కూటర్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతడికి దగ్గరగా వచ్చి వెంటనే తలపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ తగిలి అతడు కిందపడిపోగా వారు స్కూటర్ దిగి మళ్లీ తలపై, ఛాతీపై పదేపదే కాల్పులు జరిపి పారిపోయారు.