ముంబై: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం కేసీఆర్ బృందం ఫడ్నవిస్ను కలిసింది. ఇరు రాష్ట్రాల మధ్య సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ఫడ్నవీస్‌తో ఆయన చర్చించారు. కేసీఆర్ అంతకుముందు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ అయ్యారు.