రాయ్‌పూర్: ఆర్తి రావ్టే.. ఈ పదకొండేళ్ల బాలిక తన ఊరినే ఆదర్శవంతంగా తీర్చిదిద్దింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాజనందగాం జిల్లా దోబ్ని గ్రామాన్ని ఆరుబయట మలమూత్ర విసర్జన చేయని గ్రామాల జాబితాలో చేర్చింది. గ్రామంలో రెండేళ్ల కిందటే ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించినా, వాటిని ప్రజలు ఉపయోగించే వారు కారు. దీంతో ఆర్తి ఉదయం నాలుగింటికే లేచి ఆరుబయట మలమూత్ర విసర్జన చేయకుండా తన సహవిద్యార్థులతో కలిసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. కొన్ని రోజుల తర్వాత గ్రామ ప్రజలు ఇంటిలోని మరుగుదొడ్లు వినియోగించడంతో ఊరి పరిసరాలే మారిపోయాయి.