వెన్నతో వెన్నదొంగ
ముంబై: వెన్నదొంగ అంటే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.. ఆ దొంగను అదే వెన్నతో బొమ్మలా చేశారు. శనివారం కృష్ణాష్టమి సందర్భంగా ముంబైలోని అంధేరిలో వెన్నతో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తయారు చేశారు. దీన్ని తయారు చేయడానికి దాదాపు 70 గంటల సమయం పట్టిందని వారు చెప్పారు. 470 కిలోల వెన్నతో ఈ వెన్నదొంగ నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేశారు. దీన్ని ఒక ప్రత్యేకమైన అద్దాల మండపంలో ఉంచి వెన్న కరిగిపోకుండా ఉండేందుకు లోపల 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంచారు. ఈ బటర్ ఆర్ట్ విగ్రహాన్ని ముంబై అంధేరి ప్రాంతంలోని ఇన్ఫినిటీ మాల్లో ప్రదర్శించారు. ఇది భారతదేశంలోనే అతి ఎత్తైన శ్రీకృష్ణుడి నిలువెత్తు విగ్రహం.