సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో హత్యలు, అత్యాచారాలు చేస్తున్న వారిలో అధికంగా 16–35 ఏళ్ల వయసు కలిగిన వారే ఉన్నారని, సరైన ఉద్యోగాలు లేక నైరాశ్యంలో ఉన్నవారంతా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. దిశ ఘటనపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వానిదే బాధ్యత అని ఆరోపించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ అంశాన్ని కేవలం ఒక ఘటనగా పరిమితం చేసి చూడలేమని, దీన్ని సామాజిక, ఆర్థిక అంశాల్లో విశ్లేషణాత్మకంగా చూడాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. దిశ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని, దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment