అమిత్‌షాయే ఉగ్రవాది: లాలూ | Lalu Prasad Yadav calls Amit Shah a 'terrorist' | Sakshi
Sakshi News home page

అమిత్‌షాయే ఉగ్రవాది: లాలూ

Published Wed, May 7 2014 2:35 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

అమిత్‌షాయే ఉగ్రవాది: లాలూ - Sakshi

అమిత్‌షాయే ఉగ్రవాది: లాలూ

పాట్నా: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ సన్నిహితుడైన అమిత్‌షా ఒక ఉగ్రవాది అని ఆర్‌జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. ఇటీవల యూపీలోని ఆజంగఢ్‌ను  ఉగ్రవాదుల అడ్డాగా అమిత్‌షా పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనికి ప్రతి స్పందనగా లాలూ పై వ్యాఖ్యలు చేశారు. మోడీకి కుడిభుజమైన అమిత్‌షా గుజరాత్‌లో నరమేధానికి, యూపీలోని ముజఫర్ నగర్ అల్లర్లకు ప్రధాన కారకుడని లాలూ ధ్వజమెత్తారు. మతపరమైన హింసతో దేశాన్ని  దగ్ధం చే సే వ్యక్తులు వీరిద్దరని ఆయన ఆరోపించారు. కాగా అమిత్‌షా అజంగఢ్‌పై చేసిన వ్యాఖ్యలపై ఈసీ చర్య తీసుకోవాలని పలు పార్టీలు కోరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement