కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నారు | Lalu Prasad Yadav comments on cabinet reorganization | Sakshi
Sakshi News home page

కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నారు

Published Mon, Sep 4 2017 2:33 AM | Last Updated on Sun, Sep 17 2017 6:20 PM

కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నారు

కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నారు

పట్నా: కేబినెట్‌లో జేడీయూకు చోటు లభించకపోవడంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వ్యంగ్యంగా స్పందించారు. కొంతమంది జేడీయూ నేతలు ప్రమాణ స్వీకారోత్సవానికి కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నారనీ, కానీ వారికి మంత్రివర్గంలోకి ఆహ్వానమే అందలేదని లాలూ అన్నారు.

పునర్వ్యవస్థీకరణ గురించి మోదీ తమతో ఒక్కమాట కూడా మాట్లాడలేదని జేడీయూ అధ్యక్షుడు, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశే స్వయంగా ఒప్పుకున్నారని లాలూ అన్నారు. అమిత్‌ షా, మోదీలకు నితీశ్‌ వ్యక్తిత్వం గురించి తెలుసు కాబట్టే జేడీయూను మంత్రివర్గంలోకి తీసుకోలేదని విమర్శించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement