
పట్నా : కరోనా లాక్‌డౌన్ వలస కూలీల పాలిట శాపంగా మారింది. లాక్‌డౌన్‌తో ఉపాధి లేక తమ స్వస్థలాకు బయలుదేరిన పలువురు వలస కూలీలు రోడ్డు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. బిహార్‌లోని బగల్‌పూర్‌లో నౌగచియాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 9మంది వలస కూలీలు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి.
వలకార్మికులతో వెళుతున్న లోడు లారీ, బస్సును ఢీకొట్టి అదుపుతప్పి రోడ్డుపక్కనపడిపోయింది. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో.. ఏడుగురు వలస కూలీల మృతి)
Comments
Please login to add a commentAdd a comment