
లక్నో: అడవి నుంచి దారి తప్పిన ఓ చిరుత పులి బావిలో పడిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహ జిల్లా ముబారక్‌పూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. చిరుత బావిలోపడ్డ విషయాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న ఇరు శాఖల సిబ్బంది చిరుతను వెలికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. బావిని పూర్తిగా వలతో కప్పేసిన అటవీశాఖ అధికారులు.. చిరుతకు ట్రాంక్విలైజర్ ఇచ్చి పైకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఇక చిరుత సమాచారం తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. కాగా, అడవులు తరిగిపోవడంతోనే వన్యప్రాణులు తమ ఆవాసాల నుంచి బయటికొస్తున్నాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment