88వ పడిలోకి అద్వానీ | LK advani birthday | Sakshi
Sakshi News home page

88వ పడిలోకి అద్వానీ

Published Mon, Nov 9 2015 3:18 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

88వ పడిలోకి అద్వానీ - Sakshi

88వ పడిలోకి అద్వానీ

న్యూఢిల్లీ: మాజీ ఉప ప్రధాని ఎల్.కె.అద్వానీ ఆదివారం 88వ పడిలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ స్వయంగా అద్వానీ నివాసానికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీలు అద్వానీకి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా అద్వానీ నివాసానికి వెళ్లి కలిశారు. మోదీ రాక సందర్భంగా ఆయన అక్కడే ఉన్నారు. కాగా, అద్వానీ పార్టీకి మార్గదర్శి అని, గురువులాంటివారని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ట్వీటర్‌లో కూడా మోదీ తన శుభాకాంక్షలను వెల్లడించారు. దేశానికి అద్వానీ అందించిన సేవలు ఎనలేనివని ఆయన కొనియాడారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఇతర బీజేపీ ప్రముఖులు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ కూడా అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement