న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని అరికట్టడానికి లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, ప్రజలతోపాటూ అన్నీ పార్టీలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. లాక్‌డౌన్ కేవలం కరోనా వ్యాప్తిని మాత్రమే అడ్డుకుంటుందని, ఆ తర్వాత మళ్లీ విజృంభించే అవకాశం లేకపోలేదన్నారు. (‘తక్షణమే రేషన్ కార్డులు జారీ చేయండి’)
కరోనా పై పోరాటానికి వైద్య పరీక్షలు భారీగా పెంచాలని రాహుల్ గాంధీ అన్నారు. వయనాడ్‌లో కరోనా నియంత్రణ సమర్థంగా జరుగుతోందని, కరోనాపై పోరులో కేరళ తీసుకున్న జాగ్రత్తలు అన్ని చోట్లా తీసుకోవాలని సూచించారు. రోజువారీ కూలీలు, కార్మికులు ఉపాధిలేక ఇబ్బంది పడుతున్నారని, వారిని ఆదుకోవడానికి ప్రణాళికలు రూపొందిచాలని తెలిపారు. కరోనాపై పోరులో అందుబాటులో ఉన్న వనరులన్నీ వినియోగించుకోవాలని, ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి ఆహారం అందించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment