లవ్ జీహాదా.. అంటే ఏమిటి?: రాజ్‌నాథ్ | 'Love Jihad? What is That?' Asks Rajnath Singh | Sakshi
Sakshi News home page

లవ్ జీహాదా.. అంటే ఏమిటి?: రాజ్‌నాథ్

Published Sat, Sep 13 2014 4:44 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

లవ్ జీహాదా.. అంటే ఏమిటి?: రాజ్‌నాథ్ - Sakshi

లవ్ జీహాదా.. అంటే ఏమిటి?: రాజ్‌నాథ్

న్యూఢిల్లీ: ‘లవ్ జీహాదా.. అంటే ఏమిటి?’ కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్‌సింగ్ అడిగిన ప్రశ్న ఇదీ. ఒకవైపు బీజేపీ నేతలు లవ్‌జీహాద్ పేరుతో ముస్లిం యువకులు హిందూ యువతులను పెళ్లి చేసుకుని వారి మతం మార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటున్న సమయంలో రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. లవ్‌జీహాద్ అంశంపై మీ అభిప్రాయం ఏమిటని విలేకరుల ప్రశ్నలకు‘లవ్ జీహాదా అంటే ఏమిటి?’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. కాగా ఆయుధాలు వీడితే నక్సల్స్ తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. కాగా, ప్రధాని మోడీతో తనకు విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement