మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి దివాకర్ రవోటె (ఫైల్‌ఫోటో)
సాక్షి, ముంబయి : కార్మిక సంఘాలపై మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి దివాకర్ రవోటే ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్‌ఆర్‌టీసీ) ఉద్యోగులు, కార్మికులు ఇటీవల చేపట్టిన సమ్మె కార్మిక సంఘాల అహంభావ సమస్యల ఫలితమేనని వ్యాఖ్యానించారు. వేతన పెంపును కోరుతూ శుక్రవారం ఎంఎస్‌ఆర్‌టీసీ ఉద్యోగులు శుక్రవారం పలు డిపోల ఎదుట ఆందోళనలతో సమ్మె బాట పట్టారు. సమ్మె కారణంగా బస్సు సర్వీసులు నిలిచిపోయి వేలాది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మంత్రి రవోటేతో కార్మిక సంఘాల సంప్రదింపుల నేపథ్యంలో శనివారం సమ్మెను నిలిపివేశారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో నేరుగా ఉద్యోగులు సమ్మెకు దిగరాదని తాను ఎంఎస్‌ఆర్‌టీసీ ఎండీకి స్పష్టం చేశానని చెప్పారు. ఉద్యోగులందరూ కార్మిక సంఘాలకు అనుబంధంగా ఉన్నారని రవోటే తెలిపారు. కార్మిక సంఘాల అహంభావ ధోరణి కారణంగానే కార్మికులు, ఉద్యోగులు సమ్మె బాట పట్టారని వ్యాఖ్యానించారు.
జూన్ 1న ప్రభుత్వం ప్రకటించిన వేతన పెంపుపై ప్రభుత్వంతో వారు అధికారికంగా ఒప్పందంపై సంతకాలు చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయని చెప్పారు. వారు కొత్తగా ఎలాంటి వేతన పెంపునూ కోరలేదని..వారి డిమాండ్‌ను నెరవేర్చడం ద్వారా వారి మంకుపట్టును తాను సంతృప్తిపరిచానని మంత్రి చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment