న్యూఢిల్లీ: సాధరణంగా రైలు వెళుతున్న సమయంలో దాని పక్కన నిల్చోవాలంటేనే గుండె హడలెత్తిపోతుంది. అలాంటిది ఏకంగా ఎదురెళితే.. అది కూడా చావాలనే ఉద్దేశంతో కావాలనే దానికిందపడితే.. ఈ రోజు ఢిల్లీలో అదే జరిగింది.
వేగంగా దూసుకొస్తున్న ఢిల్లీ మెట్రో రైలు కింద రోహిణి స్టేషన్ వద్ద ఓ 27 ఏళ్ల వ్యక్తి కావాలని దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడిని అదే ప్రాంతానికి చెందిన జయరామ్ అనే వ్యక్తిగా గుర్తించారు. అయితే, అతడు ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. తీవ్ర గాయాలకారణంగా అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
మెట్రో రైలుకు ఎదురెళ్లి..
Published Wed, Apr 6 2016 6:56 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement