50 బంగారు బిస్కెట్లు పట్టివేత.. నిందితుడి అరెస్ట్ | Man held with 50 gold biscuits at New Delhi Airport | Sakshi
Sakshi News home page

50 బంగారు బిస్కెట్లు పట్టివేత.. నిందితుడి అరెస్ట్

Published Fri, Jun 13 2014 8:18 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

Man held with 50 gold biscuits at New Delhi Airport

న్యూఢిల్లీ: దుబాయ్ నుంచి 50 బంగారు బిస్కెట్లను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు.  కేంద్ర పారిశ్రామిక భద్రత సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం ఈ సంఘటన జరిగింది.

సీఐఎస్ఎఫ్ అధికారులు కేరళకు చెందిన ఆష్రఫ్ను తనిఖీ చేయగా ఈ విషయం వెలుగు చూసింది. నిందితుడిని బంధించి కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. అతడి నుంచి 50 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్టు సీఐఎస్ఎఫ్ ప్రతినిధి చెప్పారు. కస్టమ్స్ అధికారులు నిందితుడిని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement