సెల్ఫీ వంకతో.. భార్యను చంపేశాడు!
కట్నం వ్యవహారంలో భార్యతో గొడవపడి.. సెల్ఫీ తీసుకునే వంకతో ఆమెను గంగానదిలోకి తోసేసి చంపేశాడో వ్యక్తి. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. ఆయేషా, ఆఫ్తాబ్‌లకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. వాళ్లకు 8 నెలల కొడుకు కూడా ఉన్నాడు. ఆమను తరచు అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, తేకపోవడంతో ఆమెను హతమార్చాడని ఆయేషా కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఆయేషా సోదరుడు నయీమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు మీరట్‌లోని సర్దానా స్టేషన్ పోలీసు అధికారి రాజేష్ వర్మ తెలిపారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఆఫ్తాబ్ నేరుగా తన కొడుకుతో కలిసి స్టేషన్‌కు వెళ్లాడు. ఐదుగురు దుండగులు తమను దోచుకోడానికి ప్రయత్నించారని, ఆయేషా ఎదురు తిరగడంతో ఆమెను గంగానదిలోకి తోసేశారని చెప్పాడు. అయితే పోలీసులు ఆఫ్తాబ్‌ను ప్రశ్నించినపుడు పొంతనలేని సమాధానాలు చెప్పి, చివరకు దొరికిపోయాడు. ఆమెను గంగా నది దగ్గర వరకు తీసుకెళ్లేందుకు సెల్ఫీని వంకగా తీసుకున్నాడు. ఆఫ్తాబ్‌తో పాటు అతడి అన్న షెహజాద్ మీద కూడా కేసు పెట్టారు. అతడు ఇంకా పరారీలో ఉన్నాడని వర్మ చెప్పారు.