
సాక్షి, బెంగళూరు : భార్య ఆత్మహత్యయత్నం చేయడం, ఆమె తరఫు బంధువులు భర్తను బెదిరించడంతో సెల్ఫీ వీడియో తీసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలబుగ్గి జిల్లా జీవర్గీ తాలూకా సుంబడ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న సుధాకర్ భార్య రేఖ మూడు రోజుల ముందు విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. విషయం గమనించిన స్థానికులు వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.
ఈ క్రమంలో శుక్రవారం భార్యను పరమార్శించడానికి వెళ్లిన సుధాకర్‌పై ఆమె బంధువులైన మల్లప్ప, బాగవ్వ, బీమాభాయ్, మాదేవి భౌతిక దాడికి యత్నించారు. దీంతో మనస్థాపం చెందిన సుధాకర్ తన చావుకు సదరు నలుగురు కారణమని చెప్పి సెల్ఫీ వీడియో తీసి స్నేహితులకు పంపించారు. అటుపై పక్కనే ఉన్న రైలు పట్టాలపై పడుకుని ప్రాణం తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment