
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను చంపేస్తానంటూ హెచ్చరిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు ఎన్నారై వ్యక్తి. వీడియోలో ముఖ్యమంత్రిని పరుష పదాలతో దూషించాడు. గతంలో ఆరెస్సెస్ కార్యకర్తగా పనిచేసిన తాను సీఎంను చంపడానికే సరిపడా డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలిపాడు. సీఎం విజయన్‌తోపాటు మరో మంత్రి, గతంలో టీవీ ఆర్టిస్ట్‌గా పనిచేసిన ఓ వ్యక్తిని అతను అసభ్యకర పదజాలంతో దూషించాడు. అతడు పోస్టు చేసిన ఈ వీడియో గంటలోపే వైరల్‌గా మారింది. ఈ వీడియో పోస్టు చేసిన కొద్దిసేపటికే సీఎంకు క్షమాపణలు చెబుతూ మరో వీడియో పెట్టాడు.
ఎస్‌ఎన్ కృష్ణకుమార్ నాయర్ (50) అనే కేరళ వ్యక్తి దుబాయ్‌లో సీనియర్ రిగ్గింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. సీఎంను తిడుతూ ఓ వీడియోను మంగళవారం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ‘నా పేరు కృష్ణకుమార్నాయర్. నేను నెలకు రూ. 2 లక్షల వరకు సంపాదిస్తున్నాను. ముఖ్యమంత్రిని చంపడానికే డబ్బు పోగు చేసున్నాను. కొద్ది రోజుల్లో కేరళకు వస్తున్నాను. నేను ఎవర్నైనా చంపాలనుకుంటే.. చేసి తీరుతాను’ అని వీడియోలో పేర్కొన్నాడు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీంతో ముఖ్యమంత్రి తనను క్షమించాలంటూ మరో వీడియోని పోస్ట్ చేశారు. మద్యం మత్తులో అలా మాట్లాడానని, తనను క్షమించాలని సీఎం, మంత్రులను కోరారు. తన వయస్సు చూసైనా ముఖ్యమంత్రి క్షమించాలని వేడుకున్నాడు. సీఎంను తిడుతూ ఉన్న వీడియోను తన ఫేస్‌బుక్ అకౌంట్లో నుంచి తొలగించాడు. ముఖ్యమంత్రిని అసభ్యపదజాలంతో దూషించినందుకుగాను కృష్ణకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment