ముంబై: ఓవైపు కొడుకు కిడ్నాప్, మరోవైపు భార్య హత్యతో ముంబైవాసి అంబాలా దేవ్నాథ్ (27) షాక్ కు గురయ్యాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు ప్రకాష్ అపహరణ వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యాడు. దిగులుతో ఇల్లు చేరితే రక్తం కక్కుతూ భార్య నేలమీదపడి ఉంది. దీంతో దేవనాధ్ అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు.
నల్లపోపూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు దేవ్నాథ్ కొడుకును కిడ్నాప్ చేశారు. లక్షన్నర రూపాయలిస్తే విడిచి పెడతామని డిమాండ్ చేశారు. పోలీసులకు చెబితే చంపేస్తామని దుండగులు బెదిరించారు. దీంతో హడలిపోయిన అతను ఇంటికి చేరేసరికి భార్య గత్కి సింగ్ (25) అచేతనంగా పడి ఉంది.
ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించి, విచారణ మొదలు పెట్టారు. బాలుని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
కొడుకు కిడ్నాప్, భార్య హత్య
Published Fri, Aug 21 2015 11:13 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
Advertisement
Advertisement