Tamil Nadu Crime News: Husband Arrested For Buried Sick Wife Alive In Tamil Nadu - Sakshi
Sakshi News home page

ప్రేమ వివాహం.. జబ్బుపడ్డ భార్యను బతికుండగానే పూడ్చిపెట్టాడు

Published Wed, Mar 30 2022 9:06 AM | Last Updated on Wed, Mar 30 2022 11:08 AM

Tamil Nadu Crime: Husband Buried Sick Wife Arrested - Sakshi

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెద్దలను ఒప్పించి ఎలాగోలా పెళ్లి చేసుకున్నాడు.

చెన్నై: ప్రేమించాడు.. పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నాడు. నాలుగేళ్లు కాపురం చేశాడు. కానీ, చివరికి ఆమెను బతికుండగానే పూడ్చి పెట్టాడు ఓ శాడిస్ట్‌. తమిళనాడు వేలూరు జిల్లా కాట్పాడిలో ఈ దారుణం చోటు చేసుకుంది. 

సుప్రజ, వినాయకం నాలుగేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే గత కొంతకాలంగా సుప్రజ అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ తరుణంలో జబ్బు పడ్డ ఆమెను వేధించసాగాడు వినాయకం. రెండు నెలల కిందట ఓరోజు భార్య సుప్రజను తీవ్రంగా కొట్టాడు కూడా.  దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆపై వినాయకం తన తమ్ముడు విజయ్‌, స్నేహితుడి స్నేహితుడు శివ సాయంతో అడవిలో బతికుండగానే భార్యను పూడ్చి పెట్టాడు.


పోలీసులతో నిందితుడు వినాయకం

సుప్రజ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. కేసును చేధించారు. అటవీ ప్రాంతంలో పూడ్చిన సుప్రజ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భర్త వినాయకంతో పాటు ఇద్దర్ని అరెస్ట్‌ చేశారు. సుప్రజ మరణంతో ఆమె కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement