ఆయుధాగారంలో పేలుళ్లు.. 16 మంది మృతి
ముంబయి: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పుల్గావ్ లోని కేంద్ర సైనిక ఆయుధాగారంలో భారీ అగ్నిప్రమాదం అనంతరం పెద్ద మొత్తంలో పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో మొత్తం 16 మంది సైనిక అధికారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 17మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు సైనిక అధికారులు కూడా ఉన్నారు. ఢిపెన్స్ అధికారులు ఈ మేరకు అధికారికంగా వెల్లడించారు.
భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో సమీప గ్రామంలోని వెయ్యిమందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. సోమవారం అర్థరాత్రి తొలి పేలుడు సంభవించిందని, అది ఒక షెడ్డులో జరిగిందని, రెండో పేలుడు సంభవించిన చోటు మాత్రం ఇంకా తెలియ రాలేదని స్థానికులు చెబుతున్నారు. కాగా, ఘటనా స్థలిని కేంద్ర రక్షణ శాఖమంత్రి మనోహర్ పారికర్ సందర్శించారు. మంటలు అదుపులోకి వచ్చాయని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.