రాయ్ పూర్: చత్తీస్గఢ్ లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు జరిపిన భారీ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టుల కదలికలపై సమాచారం రావడంతో బీజాపూర్ అటవీ ప్రాంతంలో పోలీసులు భారీ స్థాయిలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. అరన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండపార వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని మందుపాతర పేల్చారు. ముగ్గురు సీఆర్సీఎఫ్ జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతం
Published Sat, Feb 13 2016 2:05 PM | Last Updated on Tue, Oct 9 2018 2:39 PM
Advertisement
Advertisement