
లాలూతో కలసి పనిచేస్తా: నితీశ్
చాప్రా (బీహార్): గతంలో విభేదాలు వచ్చి విడిపోయినా ఇప్పుడు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో కలసి పనిచేస్తానని జేడీ (యు) నేత నితీశ్ కుమార్ తెలిపారు. ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో లాలూతో కలసి పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని చెప్పారు. 20 ఏళ్ల క్రితం అభిప్రాయభేదాల వల్ల విడిపోయామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ఆర్జేడీతో చేతులు కలిపానన్నారు.