
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యను మెరుగుపర్చేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నూతన మార్గదర్శకాలను రూపొందించింది. ఇకపై ప్రతి మెడికల్ కాలేజీ విధిగా బయోమెట్రిక్ అటెండెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. కాలేజీ సిబ్బంది అంతా బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సిందేనని స్పష్టం చేసింది. బయోమెట్రిక్ అటెండెన్స్ వివరాలను ప్రతి రోజూ కాలేజ్ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని పేర్కొంది. ఈ మేరకు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్‌కు సవరణలు చేసి, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నూతన నిబంధనల ప్రకారం, ఎంసీఐ ఎప్పుడు అడిగినా మెడికల్ కాలేజీలు బయోమెట్రిక్ అటెండెన్స్ వివరాలను అందజేయాల్సి ఉంటుంది. ప్రతి కాలేజీ సొంతగా వెబ్‌సైట్‌ను కలిగి ఉండాలి. ‘ఇన్ఫర్మేషన్ అండర్ మినిమమ్ స్టాండర్ట్ రిక్వైర్‌మెంట్స్ క్లాజ్’పేరిట కాలేజీకి సంబంధించిన వివరాలను ప్రతి నెలా మొదటి వారం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment