
10 కోట్ల మందిని బీజేపీలో చేర్పించటమే లక్ష్యం
హైదరాబాద్ : నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ప్రజల్లో విశ్వాసం పెరిగిందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 10 కోట్ల మందిని బీజేపీలో చేర్పించటమే లక్ష్యమన్నారు. తెలంగాణలో 35 లక్షల సభ్యత్వాలను చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు.
ఆన్లైన్లో పార్టీ సభ్యత్వానికి మంచి స్పందన వస్తోందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి 22 శాతం ఓట్లు వచ్చాయన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించే దిశగా పురోగమించాలని ఆయన సూచించారు. యూపీఏ హయాంలో ధరలు విపరీతంగా పెరిగాయని... బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ ఏడు నెలల్లో పెట్రో ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీజేపీ చిత్తశుద్ధితో అమలు చేస్తోందన్నారు. మేకిన్ ఇండియాకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు.