కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు తాము మనుషులమని మరచి ప్రవర్తించారు. కిడ్నాపర్ పేరుతో మతిస్ధిమితం లేని మహిళను అమానుషంగా కొట్టి చంపారు. ఈ ఘటన గత మంగళవారం చోటు చేసుకుంది. ఒటెరా బీబి(42)కు మతిస్ధిమితం లేదు. బిబీ తల్లిదండ్రులు ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు.
గత మంగళవారం బీబి తల్లిదండ్రులకు తెలీకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చి పొరుగు గ్రామానికి వెళ్లింది. మతిస్ధిమితం లేని ఆమె ప్రవర్తనను చూసిన ఓ గ్రామస్ధుడు తన బిడ్డను కిడ్నాప్ చేసేందుకే బీబి వచ్చినట్లు భావించాడు. దీంతో పెద్దగా కేకలు వేసి ఊళ్లో వారందరినీ పోగు చేశాడు. కోపోద్రేకులైన గ్రామస్ధులు బీబిను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ఓ ట్రాక్టర్‌కు కట్టేశారు.
దాదాపు మూడు గంటల పాటు ఆమెను కర్రలతో కొడుతూ చిత్రహింసలు పెట్టారు. కొంతమంది ఆమెపై రాళ్లతో దాడి చేశారు. అంతేకాకుండా కొందరు ఉన్మాదంతో ఆమె బట్టలు తీసేసి, గుండు చేశారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బీబిను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్రగాయాలపాలైన బీబి బాధను భరించలేక ప్రాణాలు విడిచింది. బీబిపై దాడిని హత్య కేసుగా నమోదు చేస్తున్నట్లు ముర్షిదాబాద్ డీఎస్పీ తెలిపారు. పుకారు కారణంగానే గ్రామస్ధులు ఆమెపై దాడి చేశారని తెలిపారు.
మానవత్వం మంటగలసిన వేళ..
Published Mon, Jul 3 2017 6:15 PM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM
Advertisement