లెవెల్ క్రాసింగ్ వద్ద ప్రమాదం: మంత్రి మృతి | minister dies in accident at unmanned railway crossing | Sakshi
Sakshi News home page

లెవెల్ క్రాసింగ్ వద్ద ప్రమాదం: మంత్రి మృతి

Published Mon, May 19 2014 12:59 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

లెవెల్ క్రాసింగ్ వద్ద ప్రమాదం: మంత్రి మృతి - Sakshi

లెవెల్ క్రాసింగ్ వద్ద ప్రమాదం: మంత్రి మృతి

కాపలా లేని లెవెల్ క్రాసింగ్ను దాటుతూ.. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ మంత్రి ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన యూపీలోని జౌన్పూర్ జిల్లాలో జరిగింది. మంత్రి సతాయిరామ్ ప్రయాణిస్తున్న వాహనం లెవెల్ క్రాసింగ్ను దాటుతున్నప్పుడు అవతలి నుంచి రైలు వేగంగా వచ్చి ఢీకొంది. దాంతో మంత్రితో పాటు ఆయన వాహన డ్రైవర్, వాహనంలో ఉన్న మరో సిబ్బంది కూడా అక్కడికక్కడే మరణించారు.

కాపలా లేని రైల్వే లెవెల్ క్రాసింగ్ల వద్ద గడిచిన మూడేళ్లలో జరిగిన ప్రమాదాల్లో ఇప్పటికి 200 మందికి పైగా మరణించారు. దేశం మొత్తమ్మీద దాదాపు 12,500 కాపలా లేని లెవెల్ క్రాసింగ్లు ఉన్నాయి. వీటివద్ద తరచు ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement